హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. కోయంబత్తూరులో నిర్వహించిన ర్యాలీలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు సంస్కృతిని కాపాడతామని ఉద్ఘాటించారు. ఈ దేశంలో తమిళనాడు ప్రజలు రెండో తరగతి పౌరులుగా ఉండాలనేది మోడీ.. న్యూ ఇండియా భావన అని విమర్శించారు. భిన్న సంస్కృతులు, అనేక భాషలకు దేశం నెలవు అన్నారు రాహుల్. తాము అన్ని భాషలను గౌరవిస్తామని తెలిపారు. తమిళం, హిందీ, బెంగాలీ ఇలా దేశంలో ప్రతి భాషకు ఒక రాష్ట్రం ఉందని.. ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీకి తమిళ సంస్కృతి, భాష, ప్రజల పట్ల గౌరవం లేదని రాహుల్ ఎద్దేవా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm