విజయవాడ: స్థానిక ఎన్నికలను బాయ్‌కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర రెడ్డి అన్నారు. అవసరమైతే సమ్మెకు వెళ్తామన్నారు. ‘‘ఎలక్షన్ కమిషనర్ వేనా ప్రాణాలు...మావి కావా?’’ అని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎస్ఈసీ పంతాన్ని నెగ్గించుకునేందుకు ఎన్నికలు పెడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వచ్చే ఆదేశాల అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm