హైదరాబాద్ : పిఆర్సీ సాధన కోసం ఐక్యవేదిక భాగస్వామ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈరోజు ధర్నా చౌక్ లో నిర్వహించ తలపెట్టిన ఒకరోజు నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు.
కేవలం 100 మంది రాష్ట్ర నాయకులు మాత్రమే దీక్షలో కూర్చొని నిరసన తెలియజేస్తామని ముందుగా అనుమతి కోరితే తిరస్కరించారు. అయినా శాంతియుతంగా పరిమిత సంఖ్యలో దీక్షలో కూర్చుంటామని స్టీరింగ్ కమిటీ సభ్యులు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ధర్నా చౌక్ లోనికి అంగీకరించకపోవడంతో ఇందిరా పార్కు చౌరస్తాలోనే బైఠాయింపునకు దిగారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూన.. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య నిరసనలకు అనుమతించకుండా పోలీసులు చూపుతున్న అతి ఉత్సాహం ప్రభుత్వాన్ని మరింత అభాసుపాలు చేస్తుందని స్పస్టం చేశారు. అర్ధగంట బైఠాయింపు అనంతరం ఐక్యవేదిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్కడ కూడా నాయకులు దీక్షను కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2021 02:23PM