హైదరాబాద్ : కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలో సుదీర్ఘంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 15 నుంచి అసెస్‌మెంట్-1 పరీక్షలు, ఏప్రిల్ 15 నుంచి అసెస్‌మెంట్-2 పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 7 నుంచి 13 వరకు సమ్మెటీవ్ అసెస్‌మెంట్ పరీక్షలు.. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm