హైదరాబాద్ : టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న షేక్ రఫీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం రఫీని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలు పెట్టినట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమపై పోలీసులకు పిర్యాదు చేశాడని.. బట్టలు ఊడదీసి కొట్టి, వీడియోలు తీసి.. యూ ట్యూబ్‌లో పెడతామని సదరు వ్యక్తుల నుంచి రఫీకి బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో మనోవ్యధతోనే రఫీ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గతేడాది షేక్ రఫీ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అతని ఆస్పత్రి ఖర్చుల కోసం మీగత టిక్ టాక్ సెలబ్రీటిలు ఫండ్ కలెక్ట్ చేశారు. ఈ ఫండ్ కలెక్ట్ చేసిన డబ్బుల లేక్కల గురించి కూడా సోషల్ మీడియాలో వివాదాలు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm