#WATCH Madhya Pradesh: Police use water cannons to disperse Congress workers who were taking out a march from Jawahar Chowk to Raj Bhavan in Bhopal, in the support of farmers. pic.twitter.com/7Jz6s5tdpv
— ANI (@ANI) January 23, 2021
హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ మధ్యప్రదేశ్లోని భోపాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. జవహర్ చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.