హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు.. మనసులు కలవడంతో.. వారు జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో అందులోని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల ఓ యువతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ఆ యువతి ఖమ్మం జిల్లా పాల్వంచలో హాస్టల్లో ఉండి ఇంటర్ పూర్తిచేసింది. ఇంటర్ చదువుతున్న సమయంలో ఆ యువతి.. తన తోటి విద్యార్థిని అయిన ఖమ్మం జిల్లా మణగూరుకి చెందిన మరో యువతితో(24) స్నేహం చేసింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారు జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో ఇంట్లో నుంచి పారిపోయి వికారాబాద్‌లోని ఓ గుడిలో పెళ్లిచేసుకున్నారు. అనంతరం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగించారు.
అయితే ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. మూడు నెలల తర్వాత వీరి జాడను గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి.. యువతులను వారి వారి ఇళ్లకు పంపించారు. అయితే తాము దూరమైనప్పటికీ.. ఇద్దరు యువతులు ఫోన్లో ముచ్చటించుకునేవారు. ఇది గుర్తించిన యువతుల తల్లిదండ్రులు.. పద్దతి మార్చుకోవాలని వారించారు. ఈ విషయంపై శంకర్‌పల్లికి చెందిన యువతి ఇంట్లో పది రోజుల నుంచి గొడవ జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన బాధిత యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2021 05:04PM