హైదరాబాద్ : ఐదుగురు వ్యక్తులు చిరుత పులిని చంపి వండుకుని తిన్నారు. ఈ ఘటననకు సంబందించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటు చేసుకుంది. 74 ఏండ్ల కురియాకోస్, 45 ఏండ్ల వినోద్ కలిసి మునిపారా అటవీ సమీపంలోని మంకులర్‌లో ట్రాప్ వేయగా బుధవారం ఒక చిరుతపులి చిక్కింది. దీంతో దానిని బంధించి వినోద్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిరుతను చంపి మాంసాన్ని వండుకుని తిన్నారు. 54 ఏండ్ల సాలి కుంజప్పన్, 50 ఏండ్ల సీఎస్ బిను, 50 ఏండ్ల విన్సెట్ దీనికి సహకరించారు. అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలియడంతో శుక్రవారం వినోద్ ఇంట్లో తనిఖీ చేయగా పది కేజీల చిరుత మాంసంతోపాటు దాని చర్మం, గోర్లు, పంటి భాగాలు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మేకను చిరుత చంపి తినడంతోనే దానిని బంధించాలని నిర్ణయించినట్లు నిందితుడు వినోద్ తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm