హైదరాబాద్ : అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న విషయం తెలిసిందే. అయితే జార్ఖండ్ రాష్ట్ర మెడికల్ బోర్డు సిఫారసు మేరకు లాలూను రాంచీ ఆసుపత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. లాలు ప్రసాద్ యాదవ్ న్యూమోనియాతో బాధపడుతున్నట్టు రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు గుర్తించారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించినట్టు రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ వెల్లడించారు. గత రెండ్రోజులుగా లాలు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని, నెమ్ముతో బాధపడుతున్నట్టు నిన్న గుర్తించామని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm