హైదరాబాద్ : ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఈనెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
అయితే ప్రదీప్ మాట్లాడుతుండగా దర్శకుడు మున్నా స్టేజీపైనే ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే దర్శకుడు మున్నా పక్కనే ఉన్న నిర్మాతతో పాటు మరికొందరు కూడా అక్కడ గుమిగూడి వెంటనే నీళ్లు ఇచ్చారు. చాలా సేపటి నుంచి నిలబడే ఉండటం.. లైట్ ఫోకస్ కూడా పడటంతో కాస్త కళ్లు తిరిగినట్లు అయ్యాయని చెప్పాడు మున్నా. వెంటనే అక్కడే ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వెంటనే మళ్లీ స్టేజీపైకి వచ్చాడు. తన సినిమా గురించి మాట్లాడాడు. కంగారు పడాల్సిందేం లేదని.. ఊరికే అలా కళ్లు తిరగడంతోనే కింద పడిపోయాడని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:49PM