హైదరాబాద్ : ఫాక్లాండ్ దీవుల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఫాక్లాండు దీవుల్లోని స్టాన్లీ నగరానికి దక్షిణాన 1125 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైందని భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ఉపరితలం నుంచి 10కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. ఫిలిప్పీన్సులోని దావో నగరంలో గురువారం భూకంపం సంభవించింది. అర్జెంటీనాలోనూ భూమి కంపించింది.
Mon Jan 19, 2015 06:51 pm