హైదరాబాద్ : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అంశం క్లిష్టంగా మారింది. దీనిపై ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉద్యోగ సంఘాల తీరు సరికాదని చెప్పారు.
ఉద్యోగ సంఘాలు ఎన్నికల అంశాన్ని రాజ్యాంగ ప్రకారం నిర్ణయించడానికి ఏర్పడిన సంస్థలకు వదిలివేస్తే బాగుంటుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు చేయటం మంచి సాంప్రదాయం కాదు అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 10:50AM