హైదరాబాద్ : పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏడురోజుల్లో నాలుగోసారి డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. ఈ రెండింటిపైనా లీటరుకు 25 పైసల చొప్పున శనివారం అదనపు వడ్డన పడింది. పన్నులతో కలిపి లీటరు పెట్రోలు ధర దిల్లీలో రూ.85.70, ముంబైలో రూ.92.28 చొప్పున ఉంది. డీజిల్ ధర వరసగా రూ.75.88, రూ.82.66గా ఉంది. మునుపెన్నడూ లేని స్థాయికి పెట్రో ఉత్పత్తుల ధరలు చేరడంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించైనా ఉపశమనం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి. శనివారం పెట్రోలుపై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80లకు చేరుకుంది. ఇప్పటివరకు 2018 నవంబరులో ఉన్న లీటరు పెట్రోలు ధర రూ.89.06, డీజిల్ ధర రూ.82.53లే అత్యధికం. కరోనా నేపథ్యంలో కొంత కాలంగా తగ్గిన చమురు విక్రయాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి తొలి 21 రోజుల్లో 9.65 కోట్ల లీటర్ల పెట్రోలు, 18.73 కోట్ల లీటర్ల డీజిల్ విక్రయం జరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెట్రోలు 9.88 శాతం, డీజిల్ 6.88 శాతం అధికంగా విక్రయాలు నమోదు కావటం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 11:27AM