హైదరాబాద్ : కొమురంభీంజిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సిర్పూర్(టి) అటవీ ప్రాంతంలో చిరుతపులి కదిలికలు కనిపించినట్లుగా స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులకు పులి ఎదురవడంతో..అక్కడి ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm