Wow 🤩 an Olympic medalist in the making
— KTR (@KTRTRS) January 24, 2021
Is he from Telangana or elsewhere in India? Would love to support this amazing talent https://t.co/tCeatdjxEB
హైదరాబాద్ : ఓ బాలుడి టాలెంట్ పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడి గురించి వివరాలు తెలపాలంటూ ట్వీట్ చేశారు. ఓ బాలుడు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో పల్టీలు కొడుతూ దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ తెలంగాణ మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్‌లకు ట్వీట్ చేశాడు. ఆ బాలుడికి అద్భుతమైన టాలెంట్ ఉందని, ఇది తన సండే మోటివేషన్ గిఫ్ట్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోనే రీట్వీట్ చేసిన కేటీఆర్... 'వావ్ ఒలింపిక్ మెడలిస్ట్ తయారవుతున్నాడు. అతడు తెలంగాణ బాలుడా? లేక దేశంలోని ఇతర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్సహించాలనుకుంటున్నాను' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.