ముంబై: వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఈనెల 23 నుంచి 26 వరకూ దేశవ్యాప్తంగా రైతుల నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ముంబైలో తలపెట్టిన రైతుల మహార్యాలీ, నిరసన కార్యక్రమాలకు మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు తరలివెళుతున్నారు. నాసిక్ నుంచి 90 వాహనాల్లో 1200 మందికి పైగా రైతులు ముంబై చేరుకున్నారు. ఆదివారం ఆజాద్ మైదాన్‌కు ర్యాలీగా చేరుకునే రైతులు మూడు రోజుల పాటు అక్కడే ధర్నా చేపడతారు. సోమవారం భారీ ర్యాలీగా రాజ్‌భవన్‌ను సందర్శించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు. ఆజాద్ మైదాన్‌లో గణతంత్ర వేడుకుల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజున దేశరాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించడంతో పెద్దసంఖ్యలో రైతులు రాజధానికి చేరుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm