హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన హిమాయత్‌సాగర్ వద్ద బాహ్యవలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న మినీ వ్యాన్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తో సహా క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm