హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం రోజున.. ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ కు అనుమతినివ్వాలని కోరుతూ రైతు సంఘాలు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశాయి. రింగ్ రోడ్ మీదుగా జరిగే ఆ పరేడ్ లో పంజాబ్, హర్యానాల నుంచి తరలించిన వెయ్యి ట్రాక్టర్లతో రైతులు పరేడ్ తీయబోతున్నట్టు ఆ లేఖలో ఉందని అధికారులు చెబుతున్నారు. రాజ్ పథ్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే కవాతకు తాము అడ్డుతగలబోమని, పరేడ్ కు అనుమతినివ్వాలని లేఖలో రైతులు కోరినట్టు చెబుతున్నారు. అయితే, దీనిపై పోలీసులు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, ఈ రోజు జరిగే సమావేశంలో తేలుస్తారని అన్నారు.
కొన్ని మార్గాలపై పోలీసులు, రైతుల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు అంటున్నాయి. రింగ్ రోడ్ మీదుగా పరేడ్ తీసినా.. ఆ ర్యాలీ వలయాకారంలో ఉండదని, సింఘూ, టిక్రి, ఘాజీపూర్, జైసింగ్ పూర్, చిల్లా సరిహద్దుల నుంచి రైతులు ట్రాక్టర్లలో బయల్దేరుతారని, మళ్లీ అదే రోజు తిరిగి ఆందోళనలు చేసే చోటుకు వెళ్తారని అంటున్నాయి. వాస్తవానికి తమకు పోలీసులు ట్రాక్టర్ పరేడ్ కు అనుమతినిచ్చారని కొందరు రైతు సంఘాల నేతలు శనివారం వెల్లడించారు. అయితే, పోలీసులు వెంటనే ఆ ప్రకటనను తోసిపుచ్చారు. రైతులు ఏ మార్గంలో పరేడ్ తీస్తారో తమకు రాతపూర్వకంగా లేఖ అందించలేదని, దానిపై స్పష్టత వచ్చాకే ర్యాలీపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 02:57PM