హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనతో తరించిపోయారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తమిళిసై అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. తెలంగాణ గవర్నర్ కు తిరుచానూరు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. అమ్మవారి దర్శనం అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె తిరుపతిలో ఎస్వీ వైద్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళతారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా తమిళిసై నిన్న రేణిగుంట చేరుకున్నారు. తొలుత కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని దర్శించుకుని ఆపై తిరుమల వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm