హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వసంత నగర్ పరిధిలోని ఓ గోడౌన్లో.. నిషేధిత గుట్కా అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో రూ.6 లక్షల విలువగల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని చకిలం భాస్కర్ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm