హైదరాబాద్ : వరంగల్ అర్బన్‌లో హెల్త్ వర్కర్ వనిత మృతి చెందింది. వ్యాక్సిన్ వల్లే చనిపోయిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హెల్త్ వర్కర్ వనిత మృతి కారణం వ్యాక్సిన్ రియాక్షన్ అని వైద్యాధికారులు నిర్ధారించలేదు. ఈనెల 22న హెల్త్ వర్కర్ వనిత వ్యాక్సిన్ తీసుకుంది. ఆ జిల్లాలోని శాయంపేట అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్నది హెల్త్ వర్కర్ వనిత. టీకా వేసుకున్న తర్వాతే ఆమె మృతి చెందటంతో.. తోటి వర్కర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఏమైనా అవుతుందోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోనూ కరోనా టీకా తీసుకున్న ఆశావర్కర్ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్ లో ఆశావర్కర్ విజయలక్ష్మి ఈనెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న రోజున ఆమెకు తలనొప్పి, వాంతులు వంటివి అయ్యాయి. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్ళింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో విజయలక్ష్మి మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm