హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దిశగా పెరుగులు పెడుతోంది. చాలా నగరాల్లో ఇప్పటికే రూ.90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఆదాయ వనరులు లేకపోవడంతో పెట్రోల్, డీజల్ ధరలను పెంచారు. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గాడిన పడినా ప్రభుత్వానికి ఇతర మార్గాల్లో ఆదాయం వస్తున్నా ఇంకా ఎందుకు ధరలను పెంచుతున్నారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు.
గత ఏడాది లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచమంతటా చమురుకు డిమాండ్ పడిపోయింది. ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాది బ్యారెల్ ముడిచమురు ధర 60 డాలర్ల నుంచి 19 డాలర్లకు తగ్గింది. ఐనా మన వద్ద ధరలు తగ్గలేదు. ఆ తర్వాత ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం 55 నుంచి 57 డాలర్లు పలుకుతోంది. లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. గతంలో ఎక్సైజ్ డ్యూటీ 31.93 ఉండగా దాన్ని 32.98కి, డీజిల్‌పై 15.83 ఉండగా దాన్ని 19.98కి పెంచారు. పెంచిన ఎక్సైజ్ డ్యూటీతో కేంద్రానికి అదనంగా రూ.14,500 ఆదాయం వస్తోంది.
దేశంలో పెట్రోల్ ధరలు రూ.100 దిశగా పరుగులు పెట్టడం ప్రజల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం, సహజవాయుల శాఖ లేఖరాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిన సమయంలో మనదేశంలో అదనపు సుంకాలు విధించారని ఇప్పుడు వాటిని తగ్గించమని ఇంధన శాఖ కోరింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై బడ్జెట్‌లో ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని 30-50శాతం మేర తగ్గించాలని కోరినట్లు తెలుస్తోంది. తద్వారా పెట్రోల్, డీజిల్‌పై రూ. 5 నుంచి 7 తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజంగానే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే ఇంధన ధరలు తగ్గుముఖం పడుతాయి. అప్పుడు మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి సామాన్యుడికి కాస్త ఉపశపనం లభించే అవకాశముంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 04:38PM