హైదరాబాద్ : మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో పలు భవనాల నిర్మాణాలకు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రైతు వేదిక భవనం, ఎంఆర్సీ మండల రిసోర్స్ సెంటర్ భవనాలను ప్రారంభించారు. రూ.22 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఎస్.టి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడవిదేవులపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm