భూపాలపల్లి: జిల్లాలోని రేగొండలో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గూడేపల్లి గ్రామంలో చిన్నారులు కూల్ డ్రింక్ తాగినట్లు గుర్తించారు. చిన్నారులకు కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm