హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని పోస్టాఫీస్ వీధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక (14) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. అయితే ఇదే వీధిలో నివసించే వరుసకు అన్న అయిన యువకుడు (22) కొన్ని నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాలికతో కలిసి ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్టార్ (బాలికల సంరక్షణ కేంద్రం)కు అప్పగించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. ఎస్ఐ గంగారాజ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm