లండన్: కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో జూలై 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్రిటీష్ ప్రభుత్వం లాక్డౌన్ పొడగించింది. కొత్త కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పది రోజులు క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించింది. లాక్డౌన్ చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు, జూలై 17 వరకు పబ్‌లు, రెస్టారెంట్లు, మద్యం షాపులు, దుకాణాలు, బహిరంగ ప్రదేశాలను మూసివేసే అధికారాన్ని కౌన్సిల్లకు అప్పగించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్షలో భాగంగా బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ నివేదిక సమర్పించారు. కరోనా ఇన్ఫెక్షన్ను లాక్డౌన్ ఆంక్షల అమలుతో నియంత్రించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. గతవారంతో లాక్డౌన్ గడువు ముగియాల్సి ఉండగా మళ్లీ పొడగించారు. శుక్రవారం ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయని.. ఈ సమయంలో లాక్డౌన్ పరిమితులు కుదించే ఆలోచన లేదన్నారు. పాత కరోనా వైరస్ కంటే స్ట్రెయిన్ మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చని ప్రజలను హెచ్చరించారు. బ్రిటీష్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ ప్రకారం.. పాత వేరియంట్ సోకిన వెయ్యి మందిలో పది మంది మరణిస్తే యూకే వేరియంట్లో వెయ్యి మందిలో 13 నుంచి 14 మరణాలు నమోదువుతున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్లు స్ట్రెయిన్‌పై ప్రతిభావంతంగా పని చేస్తున్నాయని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. హాస్పిటల్లో 38వేల మందికిపైగా ఉన్నారని, మొదటి వేవ్ గరిష్ఠ స్థాయి కంటే 78శాతం అధికంగా ఉన్నారని, ప్రస్తుతం యూకేలో శనివారం నాటికి 36 మిలియన్ల మందికి మహమ్మారి బారినపడగా.. మృతుల సంఖ్య 97,329కు చేరింది. మరో వైపు టీకా పంపిణీని వేగవంతం చేశామని.. 5.9 మిలియన్ల మందికి మొదటి డోసు ఇచ్చినట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm