హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం గంగాపూర్ విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పండుగ రాహుల్(18) అనే యువకుడు ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై మంథని వైపు వస్తున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న ఎరుకల శంకర్ అనే వ్యక్తి తన పని ముగించుకొని స్వగ్రామమైన కూచిరాజు పల్లికి వెళ్తున్నాడు. గంగాపూర్ సమీపంలోని రాహుల్ ద్విచక్ర వాహనం అదుపు తప్పి శంకర్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని మంథనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా రాహుల్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గాయపడ్డ శంకర్ దవాఖానలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm