హైదరాబాద్: సింఘు సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టుపై దాడి జరిగింది. గురుతేగ్ బహదూర్ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సహచర ఎంపీ గుర్‌జీత్ సింగ్ ఔజ్లాతో కలిసి వచ్చారు బిట్టు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. కర్రలు, ఆయుధాలతో కొందరు ఒక్కసారిగా తమపై దాడికి తెగపడ్డారని ఎంపీ తెలిపారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని చెప్పారు. తమలో ఒకరిని చంపేందుకే ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దాడి తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయామని వివరించారు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు మాత్రం ఇవ్వలేదు. జరిగిన ఘటన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా బిట్టు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm