హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నిన్న ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 50 వేల మంది భక్తులు వచ్చారు. వీరందరికీ దర్శనాలు కల్పించామని, ఇంకా సుమారు 12 వేల మంది స్వామి దర్శనానికి వేచి చూస్తున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. కల్యాణోత్సవాన్ని ఆన్ లైన్ లో చేయించుకున్న భక్తులు, వారాంతంలో కాకుండా మిగతా రోజుల్లో రావాలని అధికారులు అభ్యర్థించారు. ఇక నిన్న ఆదివారం నాడు హుండీ ద్వారా రూ. 3.20 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, టీటీడీ అధికారులు, అందరు ఉద్యోగులకు టీకా ఇచ్చేంత వరకూ భక్తుల సంఖ్యను అదుపులోనే ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm