హైదరాబాద్: జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ అనుచరులు రాత్రి మద్యం మత్తులో తమపై దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త వసుంధరను ఆసుపత్రికి తరలించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో తమపై కక్ష పెంచుకుని ఇప్పుడు దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm