హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఓ బైక్ ఇరుక్కుంది. దీంతో బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని ప్రతాప్‌గా గుర్తించారు. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి అని, ఇస్నాపూర్ శాఖలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm