హైదరాబాద్ : కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. గురువయూర్‌లోని ఈస్ట్ నాడాలో ఓ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏజెన్సీలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న రూ. 1.28 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా దాచిన రూ. 44.56 లక్షల ఇండియన్ కరెన్సీని కూడా సీజ్ చేశారు అధికారులు. ఈ ఏజెన్సీకి ఎలాంటి గుర్తింపు లేదని అధికారులు తేల్చారు. ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm