హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చెక్ పోస్టుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాలతో పాటు వారు తల దాచుకునే ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేశామని అధికారులు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm