హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు బాలికలు, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు పెరుగిపోతున్నాయి. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి గురైన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విష్ణు గుర్జార్ అనే వ్యక్తి దాబా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దాబా సమీపంలోనే ఓ మహిళపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంవత్సర కాలంగా మహిళను బెదిరించి ఈ దారుణానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళతో పాటు నివాసం ఉంటున్న ఆమె ఇద్దరు చెల్లెలతో పాటుగా మైనర్ కూతురుపై కన్నేశాడు. వారిని ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులకు తన ఇద్దరు చెల్లెలను, కూతురిని విష్ణు ట్రాప్ చేశాడని బాధిత మహిళ తెలుసుకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించి విష్ణుపై ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ విష్ణుపై ఫిర్యాదు చేసిన తర్వాత.. అదే కుటుంబానికి చెందిన ఇతర మహిళలు కూడా ముందుకు వచ్చి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలత విష్ణుపై బాధిత మహిళ జనవరి 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు ఆమె సోదరి కూడా విష్ణుపై కేసు పెట్టింది. ఈ విషయం తెలిసిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులును ఆశ్రయించారు. ఇలా విష్ణు తమపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఒకే కుటుంబానికి చెందిన మైనర్‌తో సహా నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విష్ణుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2021 11:32AM