హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఓ ఆటో బోల్తా పడింది. ఐనోల్ గ్రామ శివారు గ్యాస్ పైప్లైన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. ఐనోలు గ్రామ శివారులోని గ్యాస్ పైప్ లైన్ సమీపంలో పటాన్చెరువు వైపు వస్తున్న ఆటో ముందు చక్రం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2021 12:36PM