ఉత్తరప్రదేశ్: ఓ అంబులెన్సు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో మంగళవారం ఉదయం జరిగింది. గోపిగంజ్ లోని కొత్వాలి ప్రాంతంలోని అమ్వా గ్రామం సమీపంలో చిత్తోర్ గఢ్ వెళుతున్న అంబులెన్సు స్టేషనరీ ట్రక్కును ఢీకొంది. ఈ దుర్ఘటనలో అంబులెన్సులో ఉన్న ఐదుగురు మరణించారని యూపీ పోలీసులు చెప్పారు. చిత్తోర్ ఘడ్ కు వేగంగా అంబులెన్సు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm