హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే హైకోర్టులో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ ఆవిష్కరించగా.. ఈ వేడుకల్లో పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ మెంబర్స్, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 ప్రపంచ వ్యాప్తంగాఎన్నో బాధలను మిగిల్చిందని.. వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని ప్రకటించారు.. కోవిడ్ భయానక సమయంలో పలు సూచనలు, అవగాహన కల్పించే చర్యలు తీసుకోవడంలో తెలంగాణ హైకోర్టు క్రియాశీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.. క్లిష్ట సమయంలో కూడా న్యాయస్థానాలు ఎక్కడ స్తంభించకుండా తన విథిని కొనసాగించాయని.. ఆన్ లైన్ ద్వారా న్యాయస్థానాలు పని చేశాయని గుర్తుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm