హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. సింఘూ, టిక్రీ, ఘాజీపుర్ సరిహద్దుల నుంచి బయల్దేరిన కాసేపటికి పలు చోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల్లో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సిక్రీ సరిహద్దు వద్ద ట్రాక్టర్లతో వచ్చిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం రైతులు ఢిల్లీలోకి ట్రాక్టర్లతో ప్రవేశించారు. శాంతియుతంగా ట్రాక్టర్లను నడుపుకుంటూ రోడ్లపై పరేడ్ తీస్తున్నారు. ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి రైతులు వేలాది సంఖ్యలో కదిలి వచ్చారు. వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న రైతులను, ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm