హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. నిందితుల దగ్గరి నుంచి 20 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని తల్లాడ మండలం అంబేద్కర్‌నగర్ గ్రామం వద్ద గల బంగ్లా నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm