హైదరాబాద్ : ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్లో వాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అనుమతితో సరూర్‌నగర్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు రైతు సంఘాలు ప్రదర్శనగా వెళ్తున్నాయి. ర్యాలీలో సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పాల్గొన్నారు. వాహన ర్యాలీకి సాయంత్రం 5 గంటల వరకు హైకోర్టు అనుమతిచ్చింది. ర్యాలీలో ట్రాక్టర్లు వాడొద్దని.. ఇతర వాహనాలు కూడా 300కు మించి ఉండరాదని షరతు విధించింది. వాహన ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్, ఉప్పల్ క్రాస్‌రోడ్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు.
Mon Jan 19, 2015 06:51 pm