హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఓ రైతు మృతి చెందాడు. సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు మరణించాడు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. సదరు రైతు మరణానికి కారణం పోలీసు కాల్పులు జరపడమేనని నిరసన చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు చెప్పుకొస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm