హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రజలను కోరారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సేవాభావంతో ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. కరోనాతో పోరాడి మృతిచెందిన వారికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. మన దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు ఉపయోగపడటం గర్వకారణమని బాలకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm