హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో జాతీయ జెండాకు అవమానం ఘటన చోటుచేసుకుంది. చిచ్కుంద మండలంలోని పత్లపూర్లో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. అయితే జాతీయ జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తలకిందులుగా ఎగురవేశాడు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm