హైదరాబాద్ : ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నిరసనల నేపథ్యంలో అనేక రోడ్లను అధికారులు మూసివేశారు. ఇతర ప్రాంతాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జీటీకే రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, బాద్లి రోడ్డు, కేఎన్ కట్జు మార్గ్, మధుబాన్ చౌక్, కంజవాలా రోడ్డు, పల్లా రోడ్డును వాహనదారులు ఉపయోగించవద్దని ట్విట్టర్ వేదికగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఐఎస్బీటీ రోడ్డు, జీటీ రోడ్డు, పుష్త రోడ్డు, వికాశ్ మార్గ్, ఎన్-హెచ్ 24, నోయిడా లింక్ రోడ్డులోనూ ప్రయాణించవద్దని కోరింది. ఫలితంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదే సమయంలో మెట్రో సేవలకూ అంతరాయం కలిగింది. పలు లైన్లలో సమస్యాత్మక ప్రదేశాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేసినట్టు వివరించింది. గ్రే లైన్లో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లు మూతపడినట్టు ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm