హైదరాబాద్ : నుదుటి మధ్యలో రెండు కళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలకు అదో వింతగా మారింది. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ గొర్రె పిల్లను చూడ్డానికి వస్తున్నారు. పైగా దాని మూతి కూడా అసాధారణంగా కనిపిస్తోంది. అసలది గొర్రె పిల్లలానే లేదు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని మొరాహత్ గ్రామంలో చోటు చేసుకుంది. రెండ్రోజుల కిందట ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనివ్వగా, వాటిలో ఒకటి ఇలా దర్శనిమిచ్చింది. కాగా, ప్రజలు దీన్ని శివుడి అంశ అని నమ్ముతున్నారు. అంతేకాదు, ఆ వింత గొర్రె పిల్లకు పూజలు కూడా చేస్తున్నారు. దీనిపై ఆ ప్రాంత పశు వైద్యుడు పుష్కర్ రాఠీ స్పందిస్తూ, జన్యు మార్పుల కారణంగానే ఇలాంటి పిల్లలు పుడతాయని వెల్లడించారు.