భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ కేటీపీఎస్‌లో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఏడో దశ బాయిలర్ ట్యూబ్ లీకేజీ మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో మరమ్మతులు చేస్తున్న ఆరుగురు కార్మికులు జారిపడ్డారు. బాయిలర్ వేడికి ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. బాధితులను పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్ రావు ఆస్పత్రిని సందర్శించి గాయపడ్డ కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఆరాతీశారు.
Mon Jan 19, 2015 06:51 pm