అమరవాతి: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ కానున్నారు. తనకు అపాయింట్ మెంట్ కావాలని నిమ్మగడ్డ సమాచారం పంపగానే, ఈ ఉదయం 10.15 గంటలకు రావాలని గవర్నర్ సూచించారు. కాగా, ఈ భేటీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషన్ తరఫున తీసుకుంటున్న చర్యలపై ఎస్ఈసీ వివరణ ఇవ్వనున్నారు. ఆపై అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణా చర్యల గురించి కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ వివరిస్తారని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm