హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఇంటర్ తరగతుల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఆదేశాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. 300 మంది లోపు విద్యార్థులు, తగిన వసతి ఉంటే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలు నడుపుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకు మించి ఉంటే రెండు షిఫ్టుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి 1:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుపుకోవాలని సూచించింది. కానీ ఈ నిబంధనలను ఇంటర్ బోర్డు తాజాగా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒకరోజు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బోధిస్తే, మరుసటి రోజు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలను వారు చదువుతున్న కళాశాలలోనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm