హైదరాబాద్: కాచిగూడ ( నింభోలిఅడ్డ) ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందొద్దని, భవనానికి అవసరమైన మరమ్మత్తులు పరీక్షల తర్వాతే చేపడతామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీనిచ్చారు. హాస్టల్ విద్యార్థులు పలువురు బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. చాలా ఏండ్ల కిందట నిర్మించిన ఈ హాస్టల్ కు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇటీవల అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు మంత్రిని కలిసి డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున మరమ్మతులను వాయిదా వేయాలని, భోజన వసతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. వివిధ కోర్సుల పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యాక మరమ్మతులు చేపట్టాలని, అందులో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు మంత్రి కొప్పుల పలు సూచనలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm