హైదరాబాద్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కొల్లాం జిల్లా చిరక్కార ప్రాంతానికి చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా తొట్టక్కాడ్ వద్ద ఎదురుగా చేపల లోడుతో వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. కొల్లాంబలం సమీపంలో తొట్టక్కాడ్ వద్ద మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ముగ్గురు వ్యక్తులు అందులోనే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm